NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజాఓటర్ల సహకారంతో శక్తివంచన లేకుండా డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా

1 min read

ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన

55వ డివిజన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి

షేక్ కరిమున్నిషా జలీల్ 

ప్రచారంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు,అభిమానులు శ్రేయోభిలాషులు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: 55వ డివిజన్ నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, స్థానిక ప్రజలు బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థిగా షేక్ కరిమున్నిషా జలీల్ ప్రచారంలో కొనసాగుతున్నారు. డివిజన్ నుంచి పార్టీ శ్రేణులు కార్యకర్తలు,అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో షేక్ కరిమున్నిషా జలీల్  సుడిగాలి ప్రచారం కొనసాగిస్తూన్నారు, ఒక్కసారి అవకాశం ఇచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని,అభివృద్ధికి ఓటేయాలని డివిజన్ ప్రజలను అభ్యర్థిస్తున్నానన్నారు. జగనన్న ఆశీస్సులతో ఆయన ఆశయాలకు అనుగుణంగా, మన ఏలూరు అభివృద్ధి కోసం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని,అలాగే 55వ డివిజన్ ల ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు, శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, వీధి దీపాలు,ఆహ్లాదకరమైన పార్కులు,సుంద్రీకరణ మైన  రోడ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. వై సి పి మరియు డివిజన్ ప్రజలు బలపరిచిన అభ్యర్థిగా వారి ప్రోత్సాహంతో ఈ డివిజన్ నుండి విజయం సాధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి  నన్ను బలపరిచిన పార్టీ పెద్దలకు,నా ఓటర్లు కి బహుమతిగా ఇస్తానని, మీ అందరి సహకారంతోనే డివిజన్ ని అభివృద్ధి చేసి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అదేవిధంగా స్థానిక డివిజన్ లో నాకు పార్టీలకతీతంగా పెద్దలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు  తనకు మంచి ప్రోత్సాహం ఓటర్లు అందిస్తున్నారని ఓటర్ల సహకారంతోటే ఈ విజయాన్ని సాధిస్తానని  షేక్ కరిమున్నిషా జలీల్  భీమా వ్యక్తం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *