NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో AICTE స్పాన్సర్డ్ ATAL FDP ఘన ప్రారంభం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  స్థానిక రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ లో వారం రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. జి.పుల్లయ్య గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ యూనిట్ అయిన ఈ కళాశాల, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో AICTE స్పాన్సర్డ్ ATAL FDP ను అక్టోబర్ 26 నుండి 31 వరకు నిర్వహిస్తోంది. అంశం: “ఇండస్ట్రీ 4.0: ఇంటిగ్రేటింగ్ AI, IoT అండ్ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ ఫర్ స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్”.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా IIITDM కర్నూలు ప్రొఫెసర్ డా. కె. కృష్ణా నాయక్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ “ఇండస్ట్రీ 4.0 నేడు తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. AI, IoT, సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ కలయికతో స్మార్ట్ ఫ్యాక్టరీలు, ఆటోమేషన్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ సాధ్యమవుతుంది. దేశం మేక్ ఇన్ ఇండియా లక్ష్యం దిశగా వెళ్లాలంటే అధ్యాపకులు ఈ సాంకేతికతలను విద్యార్థులకు బోధించడం చాలా అవసరం. ఈ FDP అధ్యాపకులకు అద్భుత అవకాశం” అని అన్నారు.ఈ FDP కి కోఆర్డినేటర్ గా డా. బి. నాగలక్ష్మి మరియు కో-కోఆర్డినేటర్ గా డా. బి. సబీనా వ్యవహరిస్తున్నారు.ఈ కార్యక్రమంలో  విభాగాధిపతులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *