NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తెదేపా జడ్పిటీసీ అభ్యర్థిగా హైమావతి

1 min read

అత్యధిక మెజార్టీతో గెలిపించండి:సంపంగి రవీంద్రబాబు

మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల తెలుగుదేశం పార్టీ జడ్పిటిసి అభ్యర్థిగా సంపంగి హైమావతి బరిలో నిలబడ్డారు.ఈనెల 23వ తేదీ జడ్పిటిసి అభ్యర్థిగా నంద్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. మంగళవారం విత్ డ్రా చివరి రోజు కావడంతో నంద్యాల జడ్పీ కార్యాలయంలో రిటర్నింగ్ ఎన్నికల అధికారికి వడ్డే హైమావతి తెలుగుదేశం పార్టీ బీ-ఫారం పత్రాన్ని అందజేశారు.టిడిపి తరఫున ఇద్దరు జడ్పిటిసి అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్ వేశారు. చివరకు హైమావతికే జడ్పిటిసి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించింది. జడ్పిటిసి అభ్యర్థి హైమావతి నాగలూటి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు సంపంగి రవీంద్రబాబు సతీమణి..ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సహకారంతో నామినేషన్ వేసినట్లు సంపంగి రవీంద్ర బాబు మరియు జడ్పిటిసి అభ్యర్థి తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి రెండు ఓట్లను వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మండలాన్ని అభివృద్ధి చేస్తామని వారు అన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *