అంతా అనుకున్నట్టే అన్ని ఏకగ్రీవాలే…
1 min read
డిక్లరేషన్ ఫారం అందుకుంటున్న అభ్యర్థి.
వెలుగోడు , న్యూస్ నేడు: వెలుగోడు మండలంలో పరిషత్ సభ్యుల ఎన్నికలన్నీ అంతా అనుకున్నట్టే ఏకగ్రీవాలు అయ్యాయి. రాజీ రేషన్ ప్రకారము టిడిపి ఆరు, వైఎస్ఆర్సిపి ఐదు, బిజెపి ఒకటి, జనసేన ఒకటి,ఎస్డి పిఐ ఒకటి ఎంపిటిసి లను పంచుకున్నారు. మొత్తం 59 నామినేషన్స్ ఉండగా , మంగళవారం నామినేషన్స్ ఉపసంహారణ కావడం తో 45 నామినేషన్స్ ఉపసo హరించుకోవడం వల్ల 14 ఎంపిటిసి స్థానాలకు ఒక్కొక్కరే ఉండటంతో అన్ని స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వెలుగోడు -1 శీలం పరమేశ్వరి ( టిడిపి) వెలుగోడు -2 దూదేకుల నసీరున్ (వైఎస్సార్సీపీ) వెలుగోడు- 3 ఆసార్ వజీర్ భాష( టిడిపి) వెలుగోడు -4 సాజియా ఆప్రిన్( ఎస్డిపిఐ) వెలుగోడు -6 తెలుగు సంజమ్మ (వైఎస్ఆర్సిపి) మోత్కూరు తెలుగు మద్దయ్య ( వైఎస్సార్సీపీ) అబ్దుల్లాపురం నల్లకాల్వ రమణారెడ్డి( టిడిపి) బోయరేవుల ఎన్. లలితమ్మ ( టిడిపి) రేగడగూడూరు- 1 శాలి భాష( వైఎస్ఆర్సిపి) రేగడ గూడూరు- 2 పెద్దరాజు (టిడిపి), వేల్పనూరు- 1 టంగుటూరి సుకన్య (జనసేన), వేల్పనూరు-2 జె మేరమ్మ( టిడిపి) వీరంతా ఎంపిటిసిలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి హిరా నాయక్,ఎంపీడీవో గంధం మురారి తెలిపారు.


