NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలి

1 min read

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి పోలీస్, విద్య, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలి

విద్యార్థులు, యువతలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించాలి

నగరంలో గుర్తించిన 30 డార్క్ స్పాట్లలో తక్షణమే లైటింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

కర్నూలు, న్యూస్​ నేడు : జిల్లాలో మాదకద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు.  బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి జిల్లా కలెక్టర్ నార్కో కోఆర్డినేషన్ సెంటర్ (NCORD) సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా పాఠశాలలు, కళాశాలల స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, విద్యార్థుల భవిష్యత్తుపై పడే ప్రభావం, కుటుంబాలపై కలిగే దుష్పరిణామాలను వివరించాలని కలెక్టర్ తెలిపారు.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో డ్రగ్స్, గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల్లో ఎవరైనా మాదకద్రవ్యాల వినియోగానికి అలవాటుపడినట్లు గుర్తిస్తే వారి వ్యక్తిగత వివరాల గోప్యతను కాపాడుతూ నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ అందించాలని, అవసరమైన వారికి పునరావాస సేవలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో 1.5 కిలోల గంజాయి, వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 20 గ్రాముల ఎండీఎంఏ (MDMA), ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ, సంబంధిత ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని తెలిపారు.సమావేశంలో డిటిసి శాంతకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, సెట్కూర్ సీఈవో వేణుగోపాల్, డి ఈ ఓ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *