సురక్షిత డ్రైవింగ్‌కు రూ.5 కోట్లకు పైగా బహుమతులు
1 min read
: ఫ్రెష్ బస్ ‘బెస్ట్ కెప్టెన్ అవార్డు’ ప్రారంభం
హైదరాబాద్, న్యూస్ నేడు : ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేసే బస్ కెప్టెన్లను ప్రోత్సహించేందుకు ఇంటర్సిటీ ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్ ఫ్రెష్ బస్ ‘బెస్ట్ కెప్టెన్ అవార్డు’ను ప్రారంభించింది. ఈ వార్షిక కార్యక్రమం ద్వారా అర్హులైన కెప్టెన్లకు రూ.1 లక్ష వరకు నగదు బహుమతులు అందించనుంది. విజేతల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేకపోవడంతో, ఏటా రూ.5 కోట్లకు పైగా బహుమతులు పంపిణీ చేసే అవకాశం ఉంది.2026 అక్టోబర్ 20 నుంచి 2027 అక్టోబర్ 9 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 100 పాయింట్ల భద్రతా స్కోరింగ్ విధానం ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు. 100 పాయింట్లు సాధించిన వారికి రూ.1 లక్ష, 85-99 పాయింట్లు పొందిన వారికి రూ.75 వేలు, 70-84 పాయింట్లు సాధించిన వారికి రూ.50 వేల చొప్పున అందిస్తారు. 500 మందికి పైగా కెప్టెన్లు ఈ కార్యక్రమం పరిధిలో ఉన్నారు.ఫ్రెష్ బస్ వ్యవస్థాపకుడు, సీఈఓ సుధాకర్ చిర్రా మాట్లాడుతూ, “భద్రత ఎప్పుడూ ఫ్రెష్ బస్‌కు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. ప్రతి ప్రయాణంలో మా కెప్టెన్లు ప్రదర్శించే శ్రద్ధ, విచక్షణ వేలాది మంది ప్రయాణికుల నమ్మకానికి పునాది. వారి అంకితభావాన్ని గుర్తించి, సురక్షిత డ్రైవింగ్ సంస్కృతిని ప్రోత్సహించేందుకే ఈ అవార్డును ప్రారంభించాం. పరిపూర్ణ స్కోరు సాధించిన ప్రతి కెప్టెన్ ఈ గుర్తింపునకు అర్హుడు. ప్రతి కెప్టెన్‌ను సత్కరించాల్సి వచ్చినా మాకు ఎంతో సంతోషం” అని పేర్కొన్నారు.మూల్యాంకనం ధ్రువీకరించిన రికార్డులు, డేటా ఆధారంగా పారదర్శకంగా నిర్వహించనున్నారు. నగదు బహుమతులతో పాటు విజేతలకు సర్టిఫికెట్లు, డిపో నోటీసు బోర్డులపై ప్రత్యేక గుర్తింపు కూడా అందిస్తారు.


