గిరిజన గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి
1 min read
పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్ డాక్టర్ పి.వి.చలపతి రావు ఐఎఫ్ఎస్
ఏలూరు డివిజన్ కార్యాలయంలో నూతన సదుపాయాల ప్రారంభం
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ముంజులూరు బీసీ-III, వెదురు కూప్లు, నర్సరీల క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.వీఎస్ఎస్,స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖి మరియు ప్రకాశరావుపాలెం నగరవనం సందర్శనఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (PCCF & HoFF – మంగళగిరి) డాక్టర్ పి.వి. చలపతి రావు, ఐఎఫ్ఎస్ గురువారం ఏలూరు అటవీ డివిజన్ పరిధిలో విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఈ పర్యటనలో రాజమండ్రి సర్కిల్ ముఖ్య అటవీ సంరక్షణాధికారి (సీసీఎఫ్ ) డాక్టర్:జ్యోతి తుల్లిమెల్లి, ఐఎఫ్ఎస్, ఏలూరు జిల్లా అటవీ అధికారి (డి యఫ్ ఓ ) పి.వి. సందీప్ రెడ్డి, ఐఎఫ్ఎస్, ఏపీఎఫ్డీసీ (APFDC) డివిజనల్ మేనేజర్ శ్రీమతి ఎ. సత్యకళ మరియు ఇతర అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. డివిజన్ కార్యాలయ సముదాయంలో నూతన సదుపాయాల ప్రారంభంపర్యటన ప్రారంభంలో భాగంగా పీసీసీఎఫ్ డాక్టర్ పి.వి. చలపతి రావు గారు ఏలూరు డివిజన్ కార్యాలయ సముదాయంలో (Division Office Complex) నూతనంగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్‌తో పాటు పలు అభివృద్ధి సదుపాయాలను ప్రారంభించారు.వెదురు ఆర్థిక వ్యవస్థ (Bamboo Economy) క్షేత్ర పరిశీలన – ముంజులూరు & చీమలవారిగూడెం సందర్శనఅనంతరం ఉన్నతాధికారులు కన్నాపురం రేంజ్ పరిధిలోని ముంజులూరు బీసీ-111 (ముంజులూరు బి సి-III) ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ సహజ వెదురు అటవీ ప్రాంతాలను, వెదురు కోత (బంబో హార్వెస్టింగ్ ) జరుగుతున్న కూప్లను మరియు నిల్వ కేంద్రాలను స్వయంగా నడిచి, వాగులు దాటుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెదురు కూప్‌లో పనిచేస్తున్న కార్మికులు, స్థానిక వన సంరక్షణ సమితి (VSS) సభ్యులు మరియు స్వయం సహాయక సంఘాల (SHGs) మహిళలతో ముఖాముఖి సమావేశమై, శాస్త్రీయ పద్ధతిలో సాంకేతిక నిబంధనలకు అనుగుణంగా వెదురు కోత జరుగుతున్న తీరును, వివిధ రకాల వెదురు జాతుల లభ్యతను పరిశీలించారు. ఈ దిశగా జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్) సిద్ధం చేయాలని డీఆర్డీఏ పీడీ (పిడి, డిఆర్ డిఏ ) మరియు డీఎఫ్ఓలకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం, కన్నాపురం మరియు ఏలూరు రేంజ్ అధికారులు, ట్రైనీ అధికారులు, సెక్షన్,బీట్ సిబ్బంది, వీఎస్ఎస్ మరియు స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


