NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెదపాడు శాఖా గ్రంధాలయం లో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

1 min read

గ్రంథాలయ అధికారి దుగ్గుపోగు జాన్ బాబు

ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు శాఖా గ్రంధాలయం నందు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించిన  గ్రంథాలయ అధికారి దుగ్గుపోగు జాన్ బాబు మాట్లాడుతూ గ్రంథాలయాలపై అవగాహన కల్పించడం, పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పెదపాడు శాఖా గ్రంధాలయం నందు ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరగబోవు కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ప్రతి ఒక్కరూ గ్రంథాలయ సభ్యత్వాన్ని తీసుకోవాలన్నారు,ఈ సందర్భంగా బాలల దినోత్సవం, పుస్తక ప్రదర్శన, గ్రంధాలయ వ్యవస్థాపకులకు, పితామహులకు నివాళులర్పించడం,వివిధ  ప్రముఖా వ్యక్తులతో ప్రసంగాలు, సెమినార్లు, విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించబడుతుందని, నిర్వహించబడిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఈనెల 20వ తేదీన ముగింపు సభలో ముఖ్య అతిథుల చేతులమీదుగా బహుమతి ప్రధానం జరుగునని తెలియజేసినారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *