59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
1 min read
వెలుగోడు , న్యూస్ నేడు: పుస్తక పఠనం మనిషి జీవితానికి విజ్ఞానాన్ని, వికాసాన్ని, వివేకాన్ని అందించే అమూల్యమైన సాధనం. గ్రంథాలయాలు సమాజఅభ్యున్నతికి, విద్యార్థుల భవిష్యత్తుకు, యువతలో సృజనాత్మక ఆలోచనలకు పునాదులుగా నిలుస్తున్నాయి.వెలుగోడు శాఖా ఆధ్వర్యంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను 14 నవంబర్ 2026 నుండి 20 నవంబర్ 2026 వరకు ఘనంగా నిర్వహించనున్నాము.ఈ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులు, యువత, మహిళలు, పాఠకులు మరియు ప్రజలలో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించేందుకు వ్యాసరచన, వక్తృత్వం, పుస్తక ప్రదర్శనలు, పఠనాసక్తి పెంపొందించే కార్యక్రమాలు, సాహిత్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.గ్రంథాలయం కేవలం పుస్తకాలు చదివే ప్రదేశం మాత్రమే కాదు… సమాజానికి విజ్ఞానాన్ని పంచే జ్ఞానదీపం. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పత్రికా రంగం పాత్ర ఎంతో కీలకమైనది.కావున, మా శాఖ గ్రంథాలయంలో నిర్వహించనున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమాల వివరాలను మీ విలువైన దినపత్రికలు, మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచురించి, ప్రసారం చేసి ప్రజలకు విస్తృతంగా తెలియజేయవలసిందిగా సవినయంగా కోరుతున్నాము.


