ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించిన నెరనికి, నెరనికి తాండ, కొత్తపేట ఎంపీటీసీ సభ్యులు
1 min read
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటింగ్ శాతం పెరిగింది
ఎన్నికల ప్రక్రియలో అడుగడుగునా అక్రమాలు, అరాచకాలు జరిగాయి – ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
ఆలూరు న్యూస్ నేడు: హొళగుంద మండలంలోని నెరనికి, నెరనికి తాండ, కొత్తపేట గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి నాగవేణి తరఫున ఆమె భర్త మల్లేష్ ఈరోజు ఆలూరు పట్టణంలో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఘనంగా శాలువాతో సన్మానించి, అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హొళగుంద మండల వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ.. పార్టీ కేడర్ అంతా పట్టుదలతో కష్టపడి పోరాటం చేశారని, చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలను ప్రజలంతా గమనించారని అన్నారు. 2024 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు.ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలోనూ అరాచకాలు, అక్రమాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీకి ఓటింగ్ శాతం పెరగడం పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమన్నారు. ఎన్నికలు పూర్తిగా స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగి ఉంటే వైఎస్సార్‌సీపీకి మరింత భారీగా ఓటింగ్ శాతం నమోదయ్యేదని అభిప్రాయపడ్డారు.ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతూ చంద్రబాబు సరికొత్త విధానాలను అనుసరించారని, వైఎస్సార్‌సీపీ విజయాలు సాధించిన చోట సైతం ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ గతంలో ఆరోపణలు చేసినవారే, ఇప్పుడు ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.ఇన్ని అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడి ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి అన్నారు.ఈ కార్యక్రమంలో హొళగుంద మండల వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో పాటు నెరనికి, నెరనికి తాండ, కొత్తపేట గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


