బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు – విద్యా రుణాలపై అవగాహన సదస్సు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 117,నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ మరియు జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు, పోటీ పరీక్షలకు సన్నద్ధత, విద్యా రుణాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో అందుబాటులో ఉన్న వివిధ ఉద్యోగ అవకాశాలు, బ్యాంకు పరీక్షల అర్హతలు, పరీక్షల విధానం, అవసరమైన నైపుణ్యాలు, ఉద్యోగ సాధనకు అనుసరించాల్సిన ప్రణాళిక గురించి విద్యార్థులకు వివరించారు. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ లయన్ గుర్రం త్రినాథ్ కుమార్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదని, అందుబాటులో ఉన్న బ్యాంకింగ్ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమం అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా సేకరిస్తున్న వాడిన కంటి అద్దాల ఫ్రేములను సేకరించి వాటిని లయన్స్ క్లబ్ ప్రతినిధులకు అందజేశారు. ఈ ఫ్రేమ్ లను ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి పేదవారికి ఉచిత గ్లాసులతో పాటు అందించనున్నామన్నారు.


