వైఎస్ జగన్ను కలిసిన మున్సిపాలిటీ చైర్మన్
1 min read
మున్సిపల్ పీఠం విజయంపై అభినందించిన జగన్..
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ ఛైర్పర్సన్గా నూతనంగా ఎన్నికైన షేక్ ఫాతిమాభీ వైకాపా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు.మున్సిపాలిటీ పీఠం మొత్తం 32 వార్డుల్లో 23 వార్డుల కౌన్సిలర్లు మరియు చైర్మన్ విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా వైయస్ జగన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మున్సిపాలిటీ చైర్మన్ మరియు వైసీపీ పట్టణ అధ్యక్షులు మన్సూర్ అహ్మద్ జగన్ కు పూలబోకే అందజేస్తూ శాలువాతో సత్కరించారు.మున్సిపల్ ఎన్నికలు జరిగిన తీరు ఆ తర్వాత కౌంటింగ్ కేంద్రంలో కూడా వెన్నుపోటు పార్టీ నాయకులు కార్యకర్తలు చేసిన అరాచకాల గురించి వివరించారు.తను ఓడిపోయినట్లు ప్రకటించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని తెలిపారు.
అభినందించిన మాజీ సీఎం జగన్
మున్సిపాలిటీ పీఠం దక్కించుకోవడంపై యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి,నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్,మున్సిపాలిటీ చైర్మన్ ఫాతిమాభీ, మన్సూర్ లను జగన్ అభినందించారు.పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మాజీ సీఎం జగన్ సూచించారు. తర్వాత యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజాను కలిశారు.ఈ కార్యక్రమంలో ఎక్కలదేవి చంద్రమౌళి,మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అబ్ధుల్ గఫార్ తదితరులు పాల్గొన్నారు.


