సిపాయి వీర జవాను అశోక్ కుమార్ విగ్రహావిష్కరణ
1 min read
నంద్యాల, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా, చాగలమర్రి మండలంలోని పెద్ద వంగలి గ్రామంలో దేశ రక్షణ కోసం సేవలందించిన సిపాయి వీర జవాను అశోక్ కుమార్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ నెల 16వ తేదీ, సోమవారం ఘనంగా నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి వీర జవాను అశోక్ కుమార్ కుటుంబ సభ్యులు, జై జవాన్ గ్రూప్ సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నారు.ముఖ్యంగా జై జవాన్ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ , అసోసియేషన్ పెద్దలు, గ్రూప్ సభ్యులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని వీర జవానుకు ఘన నివాళులు అర్పించనున్నారు.దేశం కోసం సేవలందించిన వీర సైనికుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత. మాతృభూమి రక్షణ కోసం అంకితభావంతో పనిచేసిన అశోక్ కుమార్ సేవలను భావితరాలకు గుర్తుండేలా చేయడమే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.కావున పెద్ద వంగలి గ్రామ ప్రజలతో పాటు చాగలమర్రి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, యువత, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, దేశభక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కుటుంబ సభ్యులు, జై జవాన్ గ్రూప్ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.వీర జవానుకు ఘన నివాళి అర్పిద్దాం దేశభక్తిని చాటుదాం!వేదిక: పెద్ద వంగలి గ్రామం, చాగలమర్రి మండలం, నంద్యాల జిల్లా.తేదీ: 16 నవంబర్ 2026, సోమవారం.ఆహ్వానించువారు: వీర జవాను అశోక్ కుమార్ కుటుంబ సభ్యులు, జై జవాన్ గ్రూప్ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు.


