NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్ మెల్విన్ జోన్స్ జయంతి

1 min read

బాలల అనాధాశ్రమంలో  సేవా కార్యక్రమము.

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థల్లో ఒకటైన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం కర్నూలులోని  కీర్తన బాలల అందశ్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజ సేవే లక్ష్యంగా ఆయన ప్రారంభించిన సేవా ఉద్యమాన్ని, మానవతా విలువలను, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాల్లో లయన్స్ సంస్థ తీసుకువస్తున్న మార్పులను నాయకులు గుర్తుచేసుకున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ లయన్స్ జిల్లా చైర్పర్సన్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ  అమెరికాలోని చికాగో నగరానికి చెందిన మెల్విన్ జోన్స్ ఆలోచనతో 1917 జూన్ 7వ తేదీన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఆవిర్భవించింది. వ్యాపారవేత్తలు కేవలం వ్యాపార ప్రయోజనాలకే పరిమితం కాకుండా సమాజ అభివృద్ధికి కూడా తమ వంతు సేవ చేయాలనే గొప్ప ఆశయంతో ఈ సంస్థను ప్రారంభించారు. నేడు ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాలు, భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించి, సుమారు 50,000 క్లబ్బులు, 14 లక్షలకు పైగా సభ్యులతో విశేషమైన సేవలందిస్తోంది. పేదలు, అనాథలు, నిరుపేద విద్యార్థులు మరియు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడమే నిజమైన మానవతా సేవ అని పేర్కొన్నారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ కార్యదర్శి శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి గారి ఆదేశాల మేరకు  పిల్లలకు ఫోక్సొ ఆక్ట్ పైన అవగాహన కలిగించి ప్రతిజ్ఞ చేయించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *