32వ జాతీయ బాలలసైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి ప్రాజెక్టుల ప్రదర్శన
1 min read
125 బాల శాస్త్రవేత్తల బృందాల ప్రాజెక్టుల ప్రదర్శన
రాష్ట్రస్థాయికి ఏడు ప్రాజెక్టుల ఎంపిక
మదనపల్లె బి. శ్రీనివాసులు రెడ్డి న్యూస్ నేడు ప్రతినిది : 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ అన్నమయ్య జిల్లా స్థాయి ప్రాజెక్టుల ప్రదర్శన శుక్రవారం స్థానిక మదనపల్లె లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ ప్రదర్శనలో జిల్లా వ్యాప్తం గా 125 బాలశాస్త్రవేత్తల బృందాలు పాల్గొని తమ పరిశోధనాత్మక ప్రాజెక్టు లను ప్రదర్శించాయి. ఈ కార్యక్రమంలో డీఈవో డాక్టర్ కె. సుబ్ర హ్మణ్యం, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ అనురాధ, ఉప విద్యాశాఖ అధికారి ఎం.ఆర్. పద్మావతి, కోఆర్డినేటర్ ఎం. భాస్కరన్, డీఎస్ఓ శ్రీధర్ లు పాల్గొన్నారు. జ్యూరీ సభ్యులుగా డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ గురుప్రసాద్, డాక్టర్ చిన్నారెడ్డి, డాక్టర్ శైలజ, డైట్ కళాశాల అధ్యా పకులు ఓబుల్ రెడ్డి వ్యవహరించారు. ఈ కార్యక్రమ నిర్వహణ లో జిల్లా అకాడమిక్ కోఆర్డి నేటర్ పి.ఎల్.ఎన్. శాస్త్రితో పాటు రిసోర్స్ పర్సన్లు వరప్రసాద్, భాస్కర్, అఫ్రోజ్, కిరణ్ చంద్ర, రెడ్డి రాధ, సురేంద్ర లు పాల్గొన్నారు.


