NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చిన్నహ్యాట గ్రామ పంచాయతీ ఎన్నికలపై కీలక చర్చలు

1 min read

సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల ఎంపికపై తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి చిన్నహ్యాట శేషగిరితో నాయకులు, గ్రామ పెద్దల సమావేశం

హొళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లా హొళగుంద మండలం చిన్నహ్యాట గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల ఎంపికపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నాయకులు, పెద్దలు, పలువురు గ్రామస్తులు తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి చిన్నహ్యాట శేషగిరిని మర్యాదపూర్వకంగా కలిసి అభ్యర్థుల ఎంపికపై చర్చించారు.ఈ సమావేశంలో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, గ్రామ ప్రజల అభిప్రాయాలు, నాయకుల సూచనలు, గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.గ్రామంలో ప్రజల ఆదరణ పొందిన, గ్రామ సమస్యలపై అవగాహన కలిగి, అభివృద్ధి పట్ల నిబద్ధతతో పనిచేసే నాయకులను అభ్యర్థులుగా ఎంపిక చేయడంపై అభిప్రాయాలు పంచుకున్నారు. గ్రామ పెద్దలు, నాయకులు, ప్రజల సూచనలను పరిగణనలోకి తీసుకొని అందరి సమన్వయంతో తదుపరి కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో చర్చించారు.చిన్నహ్యాట గ్రామ పంచాయతీ అభివృద్ధి, ప్రజల ఐక్యత, ఎన్నికల్లో సమర్థవంతమైన అభ్యర్థుల ఎంపికే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *