అయ్యప్ప స్వామి వార్ల దేవస్థానంలో అయ్యప్ప దీక్షలు
1 min read
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: శ్రీ మార్కండేయ ఓంకార విశ్వేశ్వర స్వామి మరియు అయ్యప్ప స్వామి వార్ల దేవస్థానం ఏలూరు అయ్యప్ప ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పంచ అయ్యప్పల పుష్ప రథోత్సవం శనివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) హాజరైయ్యారు. మార్కండేయ స్వామి వారి ఆశీస్సులు ఏలూరు నియోజకవర్గం ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు.అలాగే ఇంతటి బృహత్తరమైన అయ్యప్ప దీక్షల కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు.


