NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేటి బాలలే రేపటి పౌరులు,దేశ భవిష్యత్తుకి పునాదులు

1 min read

బడి ఈడు పిల్లలను పని పిల్లలుగా మార్చొద్దు,చేర్చొద్దు 

అఖిల భారత యువజన 

సమాఖ్య (ఎఐవైఎఫ్) ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో

జాతీయ బాలల దినోత్సవ కార్యక్రమం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అఖిల భారత యువజన  సమాఖ్య (ఎఐవైఎఫ్) ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో 21వ డివిజన్లోని వివిధ అంగన్వాడి కేంద్రాల వద్ద ఎఐవైఎఫ్ జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యులు కూరేళ్ల వరప్రసాద్ అధ్యక్షతన జాతీయ బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యులు కూరేళ్ల వరప్రసాద్ మాట్లాడుతూనవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా దేశంలోని బాలబాలికలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.పిల్లలు దేశ సంపదని,వారి చిరునవ్వుల్లోనే దేశ భవిష్యత్తు దాగి ఉందని, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం,ఆరోగ్యం, భద్రత కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యతని ఆకాంక్షించారు. నేటికీ లక్షలాది మంది పిల్లలు పేదరికం, బాల కార్మికత్వం,విద్యకు దూరమవడం,పోషకాహార లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.బాలల చేతుల్లో పుస్తకాలు ఉండాలి కానీ పనిముట్లు కాదనీ,వారి జీవితాల్లో పేదరికం చీకట్లు తొలగించి,విద్య వెలుగులు నింపేలా ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమాలలో పాల్గొన్న సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పుప్పాల కన్నబాబు మాట్లాడుతూ భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమ,ఆప్యాయతలను స్మరించుకుంటూ ఆయన మరణానంతరం 1964 నుంచి నవంబర్ 14ను భారతదేశంలో జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు. కానీ దేశంలో బాలల హక్కులు హరించబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యవర్గ సభ్యురాలు గొర్లి స్వాతి, ఏలూరు ఏరియా కౌన్సిల్ సభ్యులు కొండేటి రాంబాబు, 21వ డివిజన్ నాయకులు తెర్లాపు శ్రీను, ఉప్పులూరి లక్ష్మి, ఉప్పులూరి భవాని,ఉప్పులూరి జ్యోతి, కొల్లూరి రేఖ, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *