NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలల హక్కుల పరిరక్షణే లక్ష్యం..

1 min read

ఆటపాటలతో బాలల హక్కుల వారోత్సవ సంబరాలు

బాల కార్మిక వ్యవస్థ, బాల్యవివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన

వందవాగిలిలో ఎం.వి. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల హక్కుల వారోత్సవ వేడుకలు

హోళగుంద న్యూస్ నేడు: బాలల హక్కుల పరిరక్షణతో పాటు ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు, సురక్షితమైన బాల్యాన్ని అందించడమే లక్ష్యంగా హోళగుంద మండలంలోని వందవాగిలి గ్రామంలో ఎం.వి. ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆశ్వర్యం కార్యక్రమంలో భాగంగా నవంబర్ 14న నిర్వహించిన ఈ వేడుకలు చిన్నారుల్లో ఆనందోత్సాహాన్ని నింపాయి.ఈ సందర్భంగా ఎం.వి. ఫౌండేషన్ మండల కోఆర్డినేటర్ సేవా నాయక్ మాట్లాడుతూ సమాజంలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని, బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి బాలబాలికకు నాణ్యమైన విద్య, సమాన హక్కులు, రక్షణ కల్పించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పిల్లల బాల్యాన్ని పనిభారంతో కాకుండా చదువు, ఆటపాటలతో ఆనందంగా గడిపేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు కృషి చేయాలని సూచించారు.బాలల్లో దాగి ఉన్న సృజనాత్మకత, క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు కబడ్డీ, ఖోఖో, మ్యూజికల్ చైర్, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఆటపాటలతో పాటు వివిధ పోటీల ద్వారా బాలల హక్కులు, విద్య ప్రాధాన్యత, బాల కార్మిక నిర్మూలన, బాల్యవివాహాల నివారణపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి దాతలుగా సత్యనారాయణ, మాజీ సర్పంచ్ శేషప్ప, మాజీ ఎంపీటీసీ నాగప్ప సహకారం అందించారు. కార్యక్రమ విజయవంతానికి సహకరించిన దాతలను నిర్వాహకులు శాలువాలతో సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎం.వి. ఫౌండేషన్ మండల కోఆర్డినేటర్ సేవా నాయక్, ఫౌండేషన్ ఆర్గనైజర్ విజయ్, రెమిడియల్ టీచర్ సుష్మ, గ్రామ పెద్దలు, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో బాలల హక్కులపై విస్తృత అవగాహన కల్పించడం, బాల కార్మిక నిర్మూలన, బాల్యవివాహాల నివారణలో ప్రజలను భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. బాలల హక్కులను కాపాడుదాం.. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం.. బాల్యవివాహాలను అరికడదాం.. ప్రతి చిన్నారికి విద్యతో కూడిన బంగారు భవిష్యత్తును అందిద్దాం అని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *