PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డైట్ కళాశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు

1 min read

పల్లెవెలుగువెబ్​, రాయచోటి: రాయచోటి ప్రభుత్వ డైట్ కళాశాలలో ఆదివారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గత 3 రోజులు వారోత్సవాల వేడుకలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.. ఈ సంధర్భంగా ఆర్ట్స్ ఎడ్యుకేషన్ అధ్యాపకులు సైకాలజిస్ట్ డాక్టర్ యం వరలక్ష్మి గారు మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించారు . అదేవిధంగా కరోనా వైరస్ కారణంగా విద్యార్థుల్లో ఏర్పడిన వివిధ సమస్యలు మరియు వాటి పరిష్కారం గురించి తెలియజేశారు. విద్యార్థులు మరియు ప్రజల్లో మానసిక ఆరోగ్య పరిస్థితి పెంపొందించడానికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author