ఏపీని రుణాంధ్రప్రదేశ్ గా మార్చారు !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ ను రుణాంధ్రప్రదేశ్ గా మార్చారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. లక్షల కోట్ల అప్పులపై మాట్లాడటం తప్పా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం అప్పులు చేసుకుంటూ పోతే ప్రజలు ఇబ్బందిపడతారని ఆందోళన వ్యక్తం చేశారు. తన పై దేశద్రోహం కేసు పెట్టారని, జగన్ ను విమర్శించిన ఉండవల్లి, పవన్ కళ్యాణ్ మీద కూడ కేసు పెడతారా ? అంటూ ప్రశ్నించారు. ప్రజల్లో అవగాహన పెంచినందుకే తనపై కేసు పెట్టారా ? అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని అప్పులు చేశారని అన్నారు. ఏమైన మాట్లాడితే పోలీసులు లేఖ రాస్తున్నారని అన్నారు.