PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజ‌య్ సేతుప‌తి అసిస్టెంట్ పై దాడి చేసిన వ్యక్తి ఎవ‌రంటే ?

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ఇటీవ‌ల బెంగ‌ళూరు ఎయిర్ పోర్టులో విజ‌య్‌ సేతుపతి అసిస్టెంట్ పై దాడి చేసిన వ్యక్తి పేరు జాన్సన్ అని తెలుస్తోంది. బెంగ‌ళూరులో నివాస‌ముండే అత‌డు మ‌ల‌యాళీ. విజ‌య్ తో సెల్ఫీ కోసం ప్రయ‌త్నించ‌గా ఆయ‌న అసిస్టెంట్లు అత‌డిని అడ్డుకున్నారు. ఇది మ‌న‌సులో పెట్టుకుని ఆ వ్యక్తి తీవ్ర ఆవేశానికి గుర‌య్యాడు. అప్పటికే అత‌ను తాగిన మైకంలో ఉన్నాడు. సెల్ఫీకి నిరాక‌రించార‌న్న ఆవేశంతో విజ‌య్‌ అసిస్టెంట్​ను త‌న్నాడు. ఈ చ‌ర్యతో అప్రమ‌త్తమైన న‌టుడి స‌హాయ‌క సిబ్బంది వెంట‌నే ఆగంత‌కుడిని ప‌ట్టుకున్నారు. అయితే విజ‌య్ మాత్రం అత‌డిని ఏమీ అన‌కుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స‌ద‌రు వ్యక్తి విజ‌య్ సేతుప‌తికి క్షమాప‌ణ‌లు చెప్పిన‌ట్లు స‌మాచారం. పునీత్ రాజ్ కుమార్ కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించేందుకు విజయ్ సేతుప‌తి బెంగ‌ళూరుకు వెళ్లారు. ఈ నేప‌థ్యంలో ఆ ఘ‌ట‌న జ‌రిగింది.

About Author