మూన్ వాటర్ తాగితే శరీరానికి ఎంతో మేలట !
1 min readపల్లెవెలుగు వెబ్:ఫ్యూరిఫైడ్ వాటర్ పేరు విన్నాం. డిస్టిల్డ్ వాటర్ పేరు విన్నాం. కానీ ఈ మూన్ వాటర్ లేదా లూనార్ వాటర్ అంటే ఏంటనుకుంటున్నారా ?. ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న ఫుడ్ ట్రెండ్ ఇది. పున్నమి చంద్రుడి ప్రభావంతో చార్జ్ అయిన నీళ్లు మన శరీరానికి మేలు చేస్తాయని చాలా మందిలో నమ్మకం ఉంది. ఓ గాజు జార్ లో నీటిని తీసుకుని రాత్రంతా చంద్రుడి కాంతి పడేలా చేస్తే అవి చార్జ్ అవుతాయని చాలా మంది నమ్ముతారు. అలా తయారు చేసుకోలేని వారికి కొన్ని సంస్థలు ఈ మూన్ వాటర్ ను ప్రత్యేకంగా తయారు చేసి ఇస్తున్నారు.