ఏపీకి తెలంగాణ బాకీ.. చెల్లించాలని సీఎం లేఖ !
1 min readపల్లెవెలుగు వెబ్: తెలంగాణ 6,111.68 కోట్ల విద్యుత్ బకాయిలు ఏపీకి చెల్లించాల్సి ఉందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. రెండు రాష్ట్రాలు ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం విద్యుత్ బకాయిల సమస్య వచ్చిందన్నారు. బకాయిల కోసం ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని.. సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు.