ఇంటింటికి తెలుగుదేశం ప్రచారంలో గోవింద్ గౌడ్‌కు గ్రామస్తుల ఘన స్వాగతం
1 min read
హొళగుంద న్యూస్ నేడు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు చేపట్టిన “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమానికి హొళగుంద మండలంలోని గ్రామానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఈడిగ గోవింద్ గౌడ్‌కు గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి, ఘనంగా ఆహ్వానించారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు, మహిళా సంక్షేమ పథకాలు, రైతులకు అందిస్తున్న సహాయం, విద్యార్థులకు కల్పిస్తున్న అవకాశాలు, గ్రామీణాభివృద్ధి పనుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఈడిగ గోవింద్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని అన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ విజయాలను ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.గ్రామ ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా సాగగా, గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


