NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిరుపేదలకు అండగా స్వామి వివేకానంద ట్రస్ట్ – భారత్ యూత్ అసోసియేషన్

1 min read

అనాధ వృద్ధులు, వికలాంగులు, నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ – సేవే పరమో ధర్మమనే లక్ష్యంతో నిరంతర సేవా కార్యక్రమాలు

హోళగుంద న్యూస్ నేడు: స్వామి వివేకానంద ట్రస్ట్, ఆదోని మరియు భారత్ యూత్ అసోసియేషన్, హోళగుంద ఆధ్వర్యంలో 55వ నెల సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనాధ వృద్ధ మహిళలు, వికలాంగులు, అత్యంత నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు.ఈ నెల సేవా కార్యక్రమంలో నిరుపేద కుటుంబానికి చెందిన హోటల్ ఈరన్న–ఎర్రమ్మ దంపతులకు, మార్లమడికి గ్రామానికి చెందిన వృద్ధురాలు రాధమ్మకు, అలాగే గ్రామానికి సేవలందిస్తున్న గుర్ఖా నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులను అందించి మానవతా చాటారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, సమాజంలో అర్హులైన నిరుపేదలు, వికలాంగులను గుర్తించి వారికి సేవా సహాయక కార్యక్రమాలను విస్తరించడంతో పాటు ప్రతి నెలా నిత్యావసర సరుకులను అందజేస్తున్నామని తెలిపారు. సమాజంలోని దాతలు, సేవాభావం కలిగిన ప్రతి ఒక్కరి సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.పేదల కష్టాలను తగ్గించేందుకు, అనాధలు, వృద్ధులు, వికలాంగులకు చేయూతనందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని వారు పిలుపునిచ్చారు. సేవాభావంతో ముందుకు వచ్చే ప్రతి దాత సహకారమే ఈ కార్యక్రమాల విజయానికి బలమని తెలిపారు.ఈ సేవా కార్యక్రమం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, నిరంతరంగా సేవలందిస్తున్న స్వామి వివేకానంద ట్రస్ట్, ఆదోని మరియు భారత్ యూత్ అసోసియేషన్, హోళగుంద సభ్యులను అభినందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *