హిందూ మతంలోకి కేరళ దర్శకుడు !
1 min readపల్లెవెలుగు వెబ్: కేరళ సినిమా దర్శకుడు అలీ అక్బర్ హిందూ మతం స్వీకరించనున్నారు. తన భార్య లూసియమ్మ కూడ హిందూ మతాన్ని స్వీకరించనుందని ఆయన తెలిపారు. రావత్ మృతిపై పలువురు సోషల్ మీడియా ఖాతాలో నవ్వుతున్న ఎమోజీలు పెట్టడం తనను తీవ్రంగా నొప్పించిందని ఆయన తెలిపారు. దీంతో తమ మతంపై విశ్వాసాన్ని కోల్పోయి, హిందూ మతంలోకి మారాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. తన పేరు రామసింహన్ గా మార్చుకుంటున్నట్టు చెప్పారు. తన సంస్కృతి, సంప్రదాయాల కోసం పోరాడి హత్యకు గురైన రామసింహన్ పేరు తనకు సరిగ్గా సరిపోతుందన్నారు. తన కూతుళ్లను మాత్రం మతం మారాలని ఒత్తిడి చేయనని అన్నారు.