పల్లె వెలుగు వెబ్ : తమిళనాడుకు చెందిన జస్టిస్ చంద్రు వ్యాఖ్యల పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆయన వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఒక జడ్జి ఎక్కడ్నుంచో ఇక్కడికి వచ్చి రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారని, రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులు వీళ్లకు పట్టవా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో కొందరు పేటీఎమ్ బ్యాచ్‌లుగా తయారయ్యాయని, ఏపీలో ఆత్మహత్యలు, అల్లకల్లోలం ఆ జడ్జీలకు కనపడదా అని అన్నారు. ఒక నేరస్థుడికి ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయవచ్చా ? అని ప్రశ్నించారు. రిటైర్ అయిన తర్వాత వీళ్ళకి పదవులు కావాలి.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఒకాయన సుప్రీంకోర్టు జడ్జ్‌గా పని చేశారని, ఆయన కుమారుడికి ఏపీలో పదవి తీసుకుని జగన్‌ను పొగుడుతున్నారని విమర్శలు చేశారు.