బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై.. సిద్ధార్థ రెడ్డి వర్గీయులు ఫైర్
1 min read- ఎమ్మెల్యే అండతో .. గ్రామాల్లో ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపణ..
పల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నందికొట్కూరు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ మురళీ కృష్ణారెడ్డి, శాతన కోట సర్పంచ్ జనార్దన్ గౌడ్ ,అల్లూరు వైసీపీ నాయకుడు అల్లంపూర్ రవీంద్ర నాయుడు, బ్రాహ్మణ కొట్కూర్ వైసీపీ యువ నాయకుడు ఓంకార్ రెడ్డి మాట్లాడారు. నందికొట్కూరు మండలం మాల్యాల గ్రామంలో ఇద్దరు రైతుల పొలం రాస్తా సమస్యను అడ్డుపెట్టుకొని గ్రామాల్లో ఫ్యాక్షన్ ప్రోత్సహించేలా టిడిపి నాయకులు మాండ్ర శివానందరెడ్డి, బిజెపి నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ అండదండలతోనే అలజడులు సృష్టించేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎదుగుదలను ఓర్వలేక … గ్రామాల అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు. సమావేశంలో వైసిపి నాయకులు వడ్డేమాన్ కట్టా శేఖర్ రెడ్డి ,దొడ్డ శివారెడ్డి ,జంగాల శేఖర్ ,కోళ్లబాపురం నాగార్జున తదితరులు పాల్గొన్నారు.