వెంకట సుబ్బయ్యకు ఘననివాళి
1 min readమృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం,డిప్యూటీ సీఎం
పల్లెవెలుగు వెబ్, కడప: కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. సాయంత్రం 4.15 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంకట సుబ్బయ్య స్వగృహానికి వెళ్లి.. భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిచిన వెంకట సుబ్బయ్య… గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో కడపలోని నాగరాజుపేట అరుణాచలం హాస్పిటల్లో చికిత్సపొందుతూ.. కోలుకోలేక మృతి చెందినట్లు బంధువులు సీఎంకు వివరించారు. ఆ తరువాత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సీఎం వెంట జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఉన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్బాష, కడప మేయర్ , వైస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్ బాబు,వైఎస్సార్సీపీ నాయకులు భరత్ రెడ్డి , సబ్ కలెక్టర్ పృద్వితీజ్, ఎమ్ ఆర్ ఓ శివరామిరెడ్డి,సిఐ సత్యనారాయణ తదితరులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.