రష్యాలాగే చైనా కుప్పకూలొచ్చు !
1 min readపల్లెవెలుగువెబ్ : చైనా విధానాలపై ఆ దేశ అత్యున్నత స్థాయి విదేశాంగ విధానం సలహాదారు జియా కింగువో పెదవి విరిచారు. పరిపూర్ణ జాతీయ భద్రతా విధానాలను గుడ్డిగా అనుసరించడంతో పాటు.. మితిమీరిన రక్షణ రంగ వ్యయం వల్ల సోవియట్ రష్యాలాగే చైనా కూడ కుప్పకూలే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. సైనిక విస్తరణ వల్ల దీర్ఘకాలిక భద్రతకు కలిగే ప్రమాదాన్ని వివరించారు. జాతీయ భద్రతపైనే పరిపూర్ణ దృష్టి పెట్టే విధానం వల్ల భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందన్నారు. ఈ విధానాన్ని గుడ్డిగా అనుసరించడం వల్ల యూనియన్ ఆఫ్ సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ కుప్పకూలినట్లుగానే చైనా కూడా కుప్పకూలే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. భద్రతను విశృంఖలంగా అనుసరించడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయని, ప్రయోజనాలు విపరీతంగా తగ్గిపోతాయని అన్నారు. భద్రతకుగల తులనాత్మక స్వభావాన్ని పట్టించుకోకపోవడం, ఈ విధానాన్ని గుడ్డిగా అనుసరించడం వల్ల దేశ భద్రత స్థాయి తగ్గుతుందని చెప్పారు. దీనివల్ల భరింపశక్యం కాని ఖర్చులు అవుతాయని, పరిపూర్ణ భద్రతను సాధించడం సాధ్యం కాదని తెలిపారు.