పీఆర్సీ సాధన సమితికి ఆర్టీసీ కార్మిక సంఘాల మద్దతు
1 min readపల్లెవెలుగువెబ్ : పీఆర్సీ జీవోల రద్దు, ఇతర అంశాల పై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. పీఆర్సీ సాధన సమితికి పూర్తీ మద్దతు ఇస్తున్నట్టు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ఉద్యమంలో ఆర్టీసీ సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని, అన్ని రకాల ఆందోళనలకు పూర్తీగా మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తే మంచి జరుగుతుందని భావించామని, ఇప్పుడు విలీనానికి ఎందుకు అంగీకరించామా అని ఆలోచించే పరిస్థితి వచ్చిందన్నారు. ఉన్న సౌకర్యాలు కోల్పోతుంటే మేం కోరుకున్న విలీనం ఇదేనా ? అని కార్మిక వర్గాల్లో చర్చ జరుగుతోందన్నారు.