సర్పంచ్ భర్త పై దొంగతనం కేసు !
1 min readపల్లెవెలుగువెబ్ : దొంగతనం కేసులో వైసీపీ సర్పంచ్ భర్త పట్టుబడ్డాడు. కృష్ణాజిల్లా మోపిదేవి దొంగతనం కేసులో సూత్రధారిగా ఉన్నట్లు తెలిసింది. ఏ కొండూరు మండలం చైతన్య నగర్ తండా సర్పంచ్ ఝాన్సీ భర్త నాగరాజుగా గుర్తించారు. సీసీఫుటేజీ ఆధారంగా నాగరాజును పోలీసులు గుర్తించారు. పలు దొంగతనాల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.