NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏళ్ల స‌మ‌స్య‌కు ప‌రిష్కారం.. ఉద్యోగుల‌కు శుభ‌వార్త !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : 1996 నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం వ‌చ్చింది. ఒకేసారి 236 మంది ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 12 మందిని జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవోలుగా నియమించగా ఇటీవలే కొత్తగా సృష్టించిన డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారులుగా మరో 51 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో 173 మందికి డీఎల్‌డీవో హోదాలో పదోన్నతి కల్పించి కొంత మందిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని వివిధ పోస్టుల్లో నియమించింది. ఇప్పటికే డిప్యుటేషన్‌పై వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారిలో అర్హత ఉన్న వారిని డీఎల్‌డీవో హోదాలోనే తిరిగి ఆయా పోస్టుల్లో కొనసాగేలా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 224 మంది డీఎల్‌డీవోలుగా పదోన్నతులు పొందారు. రాష్ట్రంలో 660 ఎంపీడీవో పోస్టులు ఉండగా మూడో వంతు మందికిపైగా ఇప్పుడు ఒకేసారి పదోన్నతులు దక్కాయి.

                              

About Author