PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోర్టు తీర్పు పై వైఎస్ జ‌గ‌న్ హ‌ర్షం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇంజినీరింగ్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పుపట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘దిశ’ స్ఫూర్తితో ఈ కేసు దర్యాప్తులో సమర్థవంతంగా వ్యవహరించిన పోలీసులను, ప్రాసిక్యూషన్‌ న్యాయవాదిని సీఎం అభినందించారు. మహిళల రక్షణ, భద్రత పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని ఈ కేసు చాటిచెప్పిందన్నారు. మహిళలు, యువతులు, బాలికలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ కోర్టు తీర్పు గట్టి సందేశాన్ని పంపిందని సీఎం వ్యాఖ్యానించారు. నేరాల నిరోధంలో, దురదృష్టవశాత్తూ జరిగే నేరాల దర్యాప్తులో పోలీసులు ఇదే స్ఫూర్తితో పనిచేసి మహిళల భద్రత, రక్షణలకు పెద్దపీట వేయాలన్నారు.

                                     

About Author