PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంజీవయ్య అడుగుజాడల్లో నడుద్దాం

1 min read
పెనికలపాటి హనుమంతరావు చౌదరి

పెనికలపాటి హనుమంతరావు చౌదరి

– టీడీపీ కల్చరల్ విభాగం అధ్యక్షుడు పెనికలపాటి హనుమంతరావు చౌదరి
పల్లెవెలుగు, కర్నూలు: నిస్వార్థ సేవకు మారు పేరు.. ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకే వన్నెతెచ్చిన దామోదరం సంజీవయ్య అడుగు జాడల్లో అందరం కలసి నడుద్దామని తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు పెనికలపాటి హనుమంతరావు చౌదరి పిలుపునిచ్చారు. దామోదరం సంజీవయ్య జయంతి, వర్ధంతి వేడుకలను పార్టీలకు అతీతంగా అందరూ జరుపుకోవడం మాత్రమే కాదు.. ఆయన అడుగుజాడల్లో నడిస్తే సమాజం ఎంతో బాగుంటుందన్నారు. వందో జయంతి వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య పేదలకు స్ఫూర్తి ప్రదాత అని.. పల్లెటూరిలో పూరి గుడిసె మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకపోవడం ఆయన సేవాభావానికి ఓ మచ్చు తునక అన్నారు. ప్రతి ఒక్కరూ దామోదరం సంజీవయ్య అడుగు జాడల్లో కట్టుబడి ముందుకు సాగాలని ఆయన కోరారు.

About Author