ఆమె తల నరికితే.. ఆస్తి మొత్తం ఇస్తా !
1 min readపల్లెవెలుగువెబ్ : మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మపై రాజస్థాన్ వ్యక్తి వివాదాస్పద వీడియో విడుదల చేశారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయిన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ తల నరికి చంపిన వారికి తన ఇల్లు, ఆస్తులను బహుమతిగా ఇస్తానని రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మేర్ నగరానికి చెందిన ఓ వ్యక్తి వివాదాస్పద వీడియోను విడుదల చేశాడు. వివాదాస్పద వీడియోను విడుదల చేసిన వ్యక్తిని సల్మాన్ చిస్తీగా పోలీసులు గుర్తించారు. నూపుర్ శర్మ తలను ఎవరైనా తీసుకువస్తే తన ఇల్లు, ఆస్తులు ఇస్తానని చెప్పిన వీడియో వైరల్ అయింది.