PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీజేపీ నేత దారుణ హ‌త్య !

1 min read

ప‌ల్ల‌వెలుగువెబ్ : కర్నాటకలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అధికార బీజేపీ పార్టీకి చెందిన నేత దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా అతడిని నరికి చంపారు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. దక్షిణ కన్నడ జిల్లాలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా యువనేత ప్రవీణ్ నెట్టారు దారుణ హత్యకు గురయ్యాడు. అయితే, ప్రవీణ్‌ స్వస్థలం సుళ్య తాలుకా బెళ్లారపేటె కేరళ సరిహద్దుల్లో ఉంది. కాగా.. ప్రవీణ్‌ స్థానికంగా ఓ పౌల్ట్రీ షాప్‌ను నిర్వహిస్తోన్నారు. అయితే, మంగళవారం రాత్రి షాప్‌ను మూసివేసి, ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. ప్రవీణ్‌ను బైక్‌పై వెంటాడి మరీ నరికి చంపారు.

                                            

About Author