సెప్టెంబర్ 28,29 .. 30 సమ్మెకువెళ్తున్నాము..
1 min read
కర్నూలు న్యూస్ నేడు: యూఎఫ్బియూ పిలుపు మేరకు ఈ రొజు కర్నూలు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా గాయత్రి ఎస్టేట్ దగ్గర సాయంత్రం 5.30గల కు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ సెప్టెంబర్ 28,29 మరియు 30 మూడు రోజులు చేయతలపెట్టిన ల సమ్మెకు ముందుస్తూ నిరసన కార్యక్రమం లో భాగంగా డిమానిస్ట్రేషన్ చేయటం జరిగింది.సమ్మెకు ప్రధాన కారణం: బ్యాంకు ల యాజమాన్య సమస్థ (IBA) మరియు బ్యాంకు యూనియన్స్2024 మార్చి నెల 8 న జరిగిన ఒప్పందం ప్రకారం బ్యాంకు ఉద్యోగులకు వారంలో 5 రొజుల పనిదినాలు కల్పిస్తామన్నారు.దీన్ని అమలు చేయమని యూనియన్స్ పలుదాపాలుగా కేంద్ర కార్మిక కమీషనర్ సమక్షంలో IBA మరియు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి తో జరిపిన చర్చలో ఎలాంటి హామీ ఇవ్వనందుకు 27 జనవరి 2026, 11 సెప్టెంబర్ 2026 సమ్మెలు చేసాము.22 సెప్టెంబర్ 2026 జరిగిన చర్చలో ఎలాంటి పురోగతి లేనందున తప్పని పరిస్థితి లో సెప్టెంబర్ 28,29 మరియు 30 సమ్మెకువెళ్తున్నాము.ఈ సమ్మెకు బ్యాంకు ఖాతాదారులుగా మమల్ని అర్థo చేసుకొని మాకు మద్దతుగా ఉండాలని కోరుతున్నాము.


