ఆ ప్రేమను మిస్ అవుతున్నా .. !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ వ్యాపారవేత్త రతన టాటా జేఆర్డీ టాటాను గుర్తు తెచ్చుకుని భావోద్వేగానికి లోనయ్యారు. జేఆర్డీ టాటా 118వ జయంతి సందర్భంగా టాటా సన్స్‌కు గౌరవ చైర్మన్ రతన్ టాటా ఇన్‌స్టాలో ఒకపోస్ట్ను షేర్ చేశారు. తాను ‘జే’ అని పిలుచుకునే జేఆర్డీ టాటా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తామిద్దరూ కలిసి జీవించిన కాలంలో ఆయన తన మీద అపారమైన ప్రభావాన్ని మిగిల్చి వెళ్లారని, ఇద్దరి మధ్య చాలా సారూప్యతలుండేవని పేర్కొన్నారు. ఆయన ప్రేమను, అభిమానాన్ని మిస్ అవుతున్నానంటూ రాశారు. ఈ రోజు జే మన మధ్య లేకపోయినా ఆయన గొప్పతనం, వారసత్వం కొనసాగుతుందని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా జేఆర్డీ టాటా ఫోటోను షేర్ చేశారు.