పునరావాస కేంద్రం ఏర్పాటుకు… దరఖాస్తులు ఆహ్వానం..
1 min readపల్లెవెలుగు వెబ్: నంద్యాల జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు పలు రకాల సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు భారతదేశ ప్రభుత్వము సామాజిక న్యాయము మరియు సాధికారత వారి సౌజన్యం తో జిల్లా పునరావాస కేంద్రాన్ని స్థాపించుటకుగాను జిల్లా పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు పి. విజయ తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ ..పునరావాస కేంద్ర స్థాపనకు, నోడల్ ఏజెన్సీని ఎంపిక చేయుటకు వికలాంగుల కొరకై పనిచేయుచున్నవంటి ఆసక్తి గల స్వచ్చంద సంస్థలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, స్వయం ప్రతిపత్తిగల సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులను తగిన ధ్రువీకరణ పత్రాలు జతపరుస్తూ ఈ నెల 4 వ తేదీ లోపు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టరేట్ కాంప్లెక్స్ కర్నూలు వారికి సాయంత్రము 5 గంటల లోగా చేరువి ధంగా పంపగలరని ఆమె కోరారు.