PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌న మెగాస్టార్ ఏడో త‌ర‌గ‌తిలోనే ప్రేమ‌లో ప‌డ్డార‌ట !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బాలీవుడ్ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమిర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ జోడిగా నటించిన చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. సూపర్‌ హిట్టయిన హాలీవుడ్‌ మూవీ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ గుడ్‌ బాయ్‌ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో చిరంజీవి స‌మ‌ర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి, అమీర్ ఖాన్‌, నాగ చైతన్యలను టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలోనే ఇంట‌ర్వ్యూలో భాగంగా ‘ఈ సినిమాలో పదేళ్ల వయసులోనే హీరో ప్రేమలో పడతాడు’ అని నాగార్జున అన్న వెంటనే.. ‘మీరు తొలిసారి ఎప్పుడు ప్రేమలో పడ్డారు?’ అని చిరుని అమీర్‌ ఖాన్‌ అడుగుతారు. అప్పుడు చిరంజీవి ‘ఏడో తరగతిలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాను. ఒక అమ్మాయి సైకిల్‌ తొక్కడం అంటే మా మొగల్తూరులో చాలా ఆశ్చర్యంగా ఉండేది. అలాంటిది ఆ అమ్మాయి పట్టుకుంటే నేను సైకిల్‌ తొక్కేవాడిని. అప్పుడు సైకిల్‌ తొక్కడంపై కాన్సంట్రేషన్‌ పక్కన పెట్టి ఆమెను చూసేవాన్ని. అప్పుడు ఆమె ముందు చూడు అంటూ నా ముఖాన్ని ముందుకు తిప్పేది’ అని తెలిపారు.

                                       

About Author