NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బొలెరో వాహనం ఢీ ..వ్యక్తి మృతి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఉలిందకొండ పోలీసు స్టేషన్ పరిధిలో 18.07.2026 తేదీన ఉదయం సుమారు 06.30 గంటల సమయంలో బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారి (NH-44) పై కర్నూలు జిల్లా, కల్లూరు మండలం, పెద్దటేకూరు గ్రామ శివారులో మహేశ్వర రెడ్డికి చెందిన పొలాల సమీపంలోని సర్వీస్ రోడ్డు వద్ద కర్నూలు జిల్లా, కల్లూరు మండలం, పెద్దటేకూరు గ్రామ నివాసి అయిన ఈరపోగు రంగస్వామి, వయస్సు 49 సంవత్సరాలు, తండ్రి late చిన్న సుంకన్న అనునతను బహిర్బుబికి వెళ్ళి పై స్థలము వద్ద సర్వీసు రోడ్డు ఎక్కుతుండగా ఒక గుర్తు తెలియని డ్రైవర్ తన AP26TG0751 నెంబరు బొలెరో వాహనాన్ని అతివేగంగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడిపుకుంటూ వచ్చి ఈరపోగు రంగస్వామిని గుద్ది, అక్కడే రోడ్డు ప్రక్కకు ఆపి ఉన్న AP40JH7170 నెంబరు గాల మోటార్ సైకిల్ ను డీ కొట్టినాడు.  అంతట ఈరపోగు రంగస్వామికి రక్తపు గాయాలు, దోకుడు గాయాలు అయి అక్కడిక్కకడే చనిపోయినాడు మరియు AP40JH7170 నెంబరు గాల మోటార్ సైకిల్ పూర్తిగా డమేజి అయినది. అంతట చనిపోయిన ఈరపోగు రంగస్వామి భార్య ఈరపోగు పద్మావతి, వయస్సు 42 సంవత్సరాలు, నివాసం: డోర్ నెం.1/77, ఎస్సీ కాలనీ, ప్యాలకుర్తి గ్రామం, కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా వారి ఫిర్యాదు మేరకు Cr.No.69/2026, U/s. 106 (1), 281 BNS గా ఉలిందకొండ పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు కాబడి విచారణ జరుగుతున్నది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *