అస్సాంను అడ్డాగా మార్చుకున్న ఆల్ ఖైదా !
1 min readపల్లెవెలుగువెబ్ : ఉగ్రవాద సంస్థ అల్ కాయిదా ఈశాన్య రాష్ట్రం అసోంను అడ్డాగా మలచుకుంది. బంగ్లాదేశ్ నుంచి యథేచ్ఛగా ఉగ్రవాదులను ఈశాన్య రాష్ట్రాలకు చేరవేస్తూ.. భారత్‌లో భారీగా రిక్రూట్‌మెంట్లకు.. విధ్వంసాలకు కుట్ర పన్నింది. అల్ కాయిదా ఇన్ ఇండియన్ సబ్-కాంటినెంట్ పేరుతో 2018లో పురుడుపోసుకున్న కొత్త అల్‌కాయిదా భారత శాఖ.. దానికి అనుబంధంగా బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న అన్సారుల్లా బంగ్లా/ఇస్లాం టీమ్ అసోంలో వేళ్లూనుకుపోయింది. జిల్లాకు, తాలూకాకు ఒకటి చొప్పున ఉగ్ర మాడ్యూళ్లను ఏర్పాటు చేస్తూ.. జోరుగా రిక్రూట్‌మెంట్లు సాగిస్తోంది. అసోంలో ఈ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న వారిలో సింహభాగం మసీదుల్లో ఇమామ్‌లుగా.. మదర్సాల్లో టీచర్లుగా పనిచేస్తున్నవారేనని పోలీసులు గుర్తించారు. వేర్వేరు మాడ్యూళ్లకు చెందిన 12 మందిని శనివారం అరెస్టు చేశారు.