టీఎన్ఎస్ఎఫ్ నేతలను విడుదల చేయాలి : నారా లోకేష్
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీలో టీఎన్ఎస్ఎఫ్ నేతల అక్రమ అరెస్ట్‌ను టీడీపీ నేత నారా లోకేష్ ఖండించారు. టీఎన్ఎస్ఎఫ్ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యాగ్రహ దీక్షను అడ్డుకోవడం సీఎం జగన్ నియంత పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వ అస్తవ్యస్త విద్యా విధానానికి వ్యతిరేకంగా శాంతియుత దీక్ష తలపెడితే ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఏకపక్ష నిర్ణయాలతో విద్యావ్యవస్థను జగన్‌రెడ్డి నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యావ్యవస్థలో పరిస్థితులను జగన్ ఇప్పటికైనా చక్కదిద్దాలని సూచించారు.