ఐకియా పై కేటీఆర్ ఆగ్రహం
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రపంచంలోనే అతి పెద్ద ఫర్నీచర్ అమ్మకాల సంస్థ ఐకియా వివాదంలో చిక్కుకుంది. ఐకియా సిబ్బంది జాత్యంహకార వ్యాఖ్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐకియా తీరును తప్పుబట్టారు. ఐకియా బాధితులకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. నితిన్ సేథి జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ తరుణంలో ఆదివారం రోజు నితిన్ సేథి భార్య, మణిపూర్‌కు చెందిన అకోలిజం సునీతా గచ్చిబౌలీ ఐకియా స్టోర్‌కి వచ్చారు. కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసి తిరిగి వెళుతుండగా కౌంటర్లో ఉన్న సిబ్బంది తమపై జాత్యంహకార వ్యాఖ్యలు చేసినట్లు బాధితురాలు ట్వీట్ చేసింది.