కృష్ణంరాజు మృతికి కారణాలివే !
1 min read
పల్లెవెలుగువెబ్ : రెబల్ స్టార్ కృష్ణం రాజు అకాల మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 83 సంవత్సరాల వయసులో కాలం చేసిన కృష్ణం రాజు కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే.. ఆయన మృతికి కారణం ఏంటో కుటుంబ సభ్యులు వెల్లడించారు. పోస్ట్ కోవిడ్ సమస్యతో కృష్ణం రాజు తొలుత ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికే రెండుసార్లు పోస్ట్ కోవిడ్ సమస్యతో బాధపడ్డ కృష్ణంరాజు గుండెపోటు రావడంతో గచ్చిబౌలి ఏఐజీలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.