పవన్ కళ్యాణ్ తో వైసీపీ నేత భేటీ !
1 min read

పల్లెవెలుగువెబ్ : అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో నిన్న భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర మాజీ సలహాదారు అయిన రాజేశ్వరరావు నిన్న హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌తో భేటీ అయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. గత కొంతకాలంగా ఆయన వైసీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌తో ఆయన భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

