అరటి పంట నష్టం అంచనా : శ్రీధర్
1 min read

పల్లెవెలుగువెబ్, మహానంది: నంద్యాల జిల్లా మహానంది మండలం లో అక్టోబర్ 1 వీచిన పెనుగాలులకు నేలవాలిన అరటి పంట నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు మండల ఉద్యానవన శాఖ శాఖ అధికారి శ్రీధర్ పేర్కొన్నారు .గాజులపల్లి గోపవరం తిమ్మాపురం ,బుక్కాపురం తదితర గ్రామాల పరిధిలో అరటి పంట పెను గాలులు వల్ల దాదాపు 550 ఎకరాలు దెబ్బతిన్నది అని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు .నివేదిక తయారు చేస్తున్నామని నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు .ఈ కార్యక్రమంలో ఆయన వెంట గోపవరం ఉద్యానవన సహాయకురాలు హరిత గోపురం గ్రామ రైతులు పాల్గొన్నారు.

