దీపావళికి గ్రీన్ కాకర్స్ కు అనుమతి లేదు !
1 min readపల్లెవెలుగువెబ్: ఢిల్లీలో బాణాసంచాపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జాతీయ రాజధాని ప్రాంతంలో బాణాసంచాపై నిషేధాన్ని ఎత్తివేయబోమని, తమ ఉత్తర్వు చాలా స్పష్టంగా ఉందని కోర్టు పేర్కొంది. పండుగ సీజన్లలో పటాకుల అమ్మకాలు, కొనుగోలు, వినియోగంపై నిషేధాన్ని సవాలు చేస్తూ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ఢిల్లీ రాజధాని ప్రాంతంలో పెరుగుతున్న కాలుష్య స్థాయిలపై ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ రాజధాని ప్రాంతంలో బాణసంచా నిషేధానికి సంబంధించిన ఉత్తర్వు చాలా స్పష్టంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.